News

ప్రధాని సమక్షంలో 551 జంటలకు సామూహిక వివాహం

393views

భావ్‌నగర్‌: తల్లిదండ్రుల్లేని 551 మంది అనాథ యువతులకు ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో సామూహిక వివాహ వేడుక జరిగింది. భావ్‌నగర్ జవహర్ మైదానంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఈ సామూహిక వివాహ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహా వేడుకలకు అనవసరమైన ఖర్చులు చేసుకోవద్దని ప్రధాని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఆహార వ్యర్థాలను తగ్గించడంతోపాటు బయోడిగ్రేడబుల్ కిచెన్ వ్యర్థాల నుంచి పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి వాటి ద్వారా సమాజానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను కోరారు. బంధువుల ఒత్తిడితో విడిగా వివాహ వేడుకలను నిర్వహించవద్దని, దీనికి బదులుగా ఆ డబ్బును పిల్లల కోసం పొదుపు చేయాలని ప్రధాని మోదీ నూతన వధూవరులను కోరారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి