News

హిందువుల దృష్టిని శ్రద్దా కేంద్రాల వైపు మరల్చుతున్న “మన ఊరు – మన గుడి – మన బాధ్యత”

447views

కర్నూలు: మహానంది క్షేత్రంలో ఈ నెల 23న ఆదివారం ఉదయం ఏడు గంటలకు పలువురి సేవకులతో భారీ ఎత్తున గరుడ నంది నుండి నగర సంకీర్తన చేశారు. తదనంతరం “మన ఊరు – మన గుడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాలు, కోనేరులోని పాచిని శుభ్రం చేశారు. కార్యక్రమం అనంతరం భజన బృందం వారు మహానంది క్షేత్రంలో భజనలు నిర్వహించారు. ఆర్యవైశ్య సత్రం వారు వెయ్యి మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం మన ఊరు – మన గుడి – మన బాధ్యత కార్యకర్తలకే సాధ్యమని సేవలోపాల్గొన్న నిర్వాహకులు శ్రీదేవి (న్యాయవాదులు), కర్నూల్ నుండి విచ్చేసిన యోగ సాధకురాలు అనురాధ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ శివ కుమార్ రెడ్డి, ధర్మ జాగరణ రాయలసీమ కన్వీనర్ రాంప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి