
పంజాబ్: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ. 660 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించారు.
ఇది 300 పడకల సామర్థ్యంతో నిర్మించిన దవాఖానాలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, కెమోథెరపీ, ఇమ్యునోథెరపీ,బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయవచ్చు.
2014కి ముందు దేశంలో 400 కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉండేవని, గత 8 ఏండ్లలో దేశంలో 200 కంటే కొత్త వైద్య కళాశాలలు నిర్మించామని ప్రధాని తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెబుతూ అందుకే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Source: Nijamtoday





