
-
ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం
కశ్మీర్: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్ యాత్రి నివాస్ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్ క్యాంపులకు బయల్దేరినట్టు సైనిక వర్గాలు ప్రకటించాయి. వీరంతా అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.
క్లౌడ్ బరస్ట్ వల్ల అమర్‌నాథ్ టెంపుల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వర్షం, వరదలు ముంచెత్తాయి. దాంతో భక్తుల గుడారాలు కొట్టుకుపోవడమే కాకుండా, దాదాపు 40 మంది భక్తులు కూడా తప్పిపోయారు. ఆర్మీ దళాలు, పారామిలటరీ బలగాలతో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు చేపట్టి వారందరినీ సురక్షితంగా కాపాడగలిగారు.
అమర్‌నాథ్ టెంపుల్‌కు మార్గం క్లియర్ అయిన తర్వాత యాత్రికుల తాజా బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంప్ నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అమర్‌నాథ్ టెంపుల్ చుట్టుపక్కల అన్ని శిథిలాలు తొలగించారు. ఆర్మీ ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేసింది. ఈ కొత్త మార్గం ప్రజల వేగవంతమైన రాకపోకలకు సహాయపడుతుంది.





