News

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ… ఉక్రెయిన్ పరిస్థితిపై ఆరా!

343views

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్‌ను మోదీ మరోసారి పుతిన్‌కు వివరించిన‌ట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021 డిసెంబర్‌లో పుతిన్.. భారత్‌లో పర్యటించినప్పుడు జరిగిన ఒప్పందాల అమలుపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు పీఎంఓ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి