News

సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌!

441views
  • ఏ1గా కేసు న‌మోదు

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

”సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే యువకులందరూ మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. లోకో ఇంజిన్లకు నిప్పు పెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంత నచ్చజెప్పినా వినలేదు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.

లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ ఉంది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టి ఉంటే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామోదర్ రాకేష్ మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్ళు విసరడంతో చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి