News

సింహగిరి రక్షణకు 10కి.మీ. గోడ

159views

సింహాచ‌లం: సింహగిరికి రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వన్యప్రాణులు, ఔషధ మొక్కల సంరక్షణతో పాటు ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఈ బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టి్టంది. ప్రహరీ నిర్మాణ బాధ్యతలను వీఎంఆర్‌డీఏకు అప్పగించగా.. తొలివిడతలో రూ.3.59 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది.

ఔషధమొక్కలు, వన్యప్రాణుల సంరక్షణకు ఉపయుక్తం జీవవైవిధ్యానికి, పర్యావరణానికి చిరునామా సింహాచలం కొండలు. తూర్పు కనుమల్లో అత్యంత సుందరమైన, పర్యావరణహితమైన గిరులుగా పేరొందాయి. సింహగిరుల్లో 70 రకాల వృక్షజాతులు, 200 రకాలైన ఔషధమొక్కల జాతులున్నట్టు గుర్తించారు. అదేవిధంగా వందలాది రకాల వన్యప్రాణులు ఈ కొండలపై ఉన్నాయి. అయితే, సింహాచలం కొండలు గతంలో ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో కొందరు ఆకతాయిలు కొండలపై నిప్పు పెట్టడంతో పలు ఔషధ మొక్కలు అగ్నికి ఆహుతవ్వగా వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. వీటన్నింటి నుంచి సింహగిరులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి