
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. స్థాయి మరచి దూషణలకు దిగుతుండటంతో విషయం పక్కదారి పట్టేలా ఉంది! తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిట్లర్ మాదిరిగా మొండిగా ముందుకెళ్తే.. ఆయనకు పట్టిన గతే పడుతుందని సుబోధ్ ఓ సభలో వ్యాఖ్యానించారు.
ఇక మోదీపై అనుచిత వ్యాఖ్యలపట్ల జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ స్పందించారు. నోటి దురుసుగా మాట్లాడటం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందని దుయ్యబట్టారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సోనియాగాంధీ కూడా ఇలాగే నోరుపారేసుకున్నారని, ఆయనను అవమానించిన కాంగ్రెస్ ఏపాటి లాభపడ్డదో గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ విపరీత వ్యాఖ్యలపట్ల కన్నెర్ర జేసిన గుజరాత్ ప్రజలు మరోసారి మోదీకి అఖండ మెజారిటీ కట్టబెట్టారని రఘుబర్‌దాస్ గుర్తు చేశారు.





