News

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!

462views

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి.

తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్‌ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్ళు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్‌ అండ్‌ రిపోర్టర్‌గా పనిచేశాడని తెలిపారు. అయితే, ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి