
-
తనకూ ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు నవీన్ జిందాల్ మద్దతుగా నిలబడటంతో ఆ ఇద్దరిపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. కాగా, తన కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచి వెళ్ళిన విషయాన్ని జిందాల్ ధ్రువీకరించారు. ”నేను ఇప్పటికీ ఢిల్లీలోనే ఉన్నాను. భయం కారణంగా నా కుటుంబ సభ్యులు సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దీనిని వలసగానే చెప్పాలి” అని జిందాల్ తెలిపారు.
కొందరని కలుసుకునేందుకు ఇటీవల తాను బయటకు వెళ్ళినప్పుడు అజ్ఞాత వ్యక్తులు తనను అనుసరించారని జిందాల్ ఆరోపించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిందాల్ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ చేసినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.





