News

నూపుర్ శర్మపై అనుచిత పోస్టు పెట్టిన ముస్లిం యువకుడి అరెస్టు

519views

క‌శ్మీర్‌: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ(ఫొటో) తలను కత్తితో నరికినట్టు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీరుకు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్’ పేరుతో ఓ చానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను జమ్మూ-కశ్మీరు పోలీసులు మీడియాకు తెలిపారు.

అంతకుముందు వనీ మాట్లాడుతూ, బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ తలను తెగ్గోసినట్టు ప్రదర్శిస్తూ వీడియోను తాను రూపొందించానని, అది క్షణాల్లోనే వైరల్ అయిందని చెప్పారు. అయితే, తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవన్నారు. తాను ఆ వీడియోను డిలీట్ చేశానన్నారు. ఆ వీడియో ఎవరినైనా గాయపరచి ఉంటే క్షమించాలని కోరానని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి