
517views
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని ఏరి పారేయాలి అని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు.
జూన్ 30న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పలువురు ఉన్నతాధికారులు హజర్యయారు.





