News

‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. కోల్‌కతా డాక్టర్ ఆఫర్‍

0views

పశ్చిమ బెంగాల్‌లో ఒక డాక్టర్ తన రోగుల కోసం ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన క్లినిక్‌కు వచ్చే రోగులు ‘జై శ్రీరామ్’   అని పలికితే వారికి కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కోల్‌కతాకు   చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీకే హజ్రా  ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడుతూ.. తన కన్సల్టేషన్ ఫీజు ముందుగా రూ. 2000 ఉండేది. ప్రజలు సహాయం చేసేందుకు తొలుత రూ.1500 లకు తగ్గించాను. కానీ ఇప్పుడు నేను మరొక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎవరైనా జై శ్రీరామ్ అంటే వారికి మరో రూ.500 తగ్గించి వారి వద్ద కేవలం రూ. 1000 మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం తన సొంత క్లినిక్‍లో కన్సల్టేషన్ వచ్చే రోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇది వర్తించదని స్పష్టం చేశారు.   ఇందులో ఎలాంటి అనైతికత లేదు. ఇది కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన చొరవ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.