News

నంద్యాలలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సేవా కార్యక్రమాలు

135views

భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతిని నంద్యాల జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం “భగీరథ సదన్”లో జరిగిన ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు స్థానిక స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ శ్రీ పోలేపల్లి సందీప్, వైద్యులు డాక్టర్ శంకర్ కుమార్, డాక్టర్ పెసల అశోక్ కుమార్, విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి శ్రీ నాగిరెడ్డి, విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ కాల్వ శేషసాయి, జిల్లా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి, డా. లలిత సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.

తదుపరి కార్యక్రమంగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో సుమారు 24 మంది యువకులు మరియు కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అవసరమైన వారికి ప్రాణదానం చేసినట్లవుతుందని నిర్వాహకులు రక్తదాతలను అభినందించారు.

జిల్లా అధ్యక్షులు శ్రీ బుగ్గన చంద్ర మౌళీశ్వర రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ గారు దేశానికి గర్వకారణమైన మహామేధావి అని, ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈ రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ సమాజ సేవలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.