
406views
-
నేరస్తుల నుండి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు
భాగ్యనగరం: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఇద్దరు ప్రధాన నిందితులను అయిదు రోజుల కస్టడీకి ఎల్బీనగర్ కోర్టు అంగీకరించగా.. చర్లపల్లి జైలులో ఉన్న మొబిన్, అహ్మద్‌లను పోలీసులు ప్రశ్నించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేరించారు.
నాగరాజు హత్యలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్టు పోలీసులు తేల్చారు. తన చెల్లిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతని బావ కలిసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాగరాజు కదలికలను తెలుసుకునేందుకు మొబైల్ ట్రాకర్ అప్లికేషన్‌ను ఉపయోగించారన్న అనుమానం నిజమైనట్టు తెలిపారు. కస్టడీ ముగియడంతో నిందితులను ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.





