
ముంబై: ముంబై వరుస పేలుళ్ళ కేసులో 29 ఏళ్ళ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్). అబు బాకర్, సయ్యద్ ఖురేషీ, మహ్మద్ యూసఫ్, మహ్మద్ షోయబ్‌లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్ ప్రాంతంలోని సర్దార్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు ఏటీఎస్ ఏడీజీ అమిత్ విశ్వకర్మ తెలిపారు.
ప్రస్తుతం నకిలీ పత్రాలు సమర్పించి పాస్‌పోర్టులు పొందారనే ఆరోపణలపై కేసు నమోదైందని.. అనంతరం పేలుళ్ళ కేసులో సీబీఐకి అప్పగిస్తామన్నారు. గతంలోనే సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ అధికారులు వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. నిందితులపై పాస్‌పోర్ట్ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
1990లో ముంబై పేలుళ్ళ ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో వీరు పనిచేశారని ఏటీఎస్ డీఐజీ దీపన్ భద్రన్ తెలిపారు. 1993లో నకిలీ పాస్పోర్టుతో పశ్చిమాసియా దేశాలకు వెళ్ళినట్టు, పేలుళ్ళ కుట్రలో ఈ నలుగురు పాల్పంచుకున్నారని.. అనంతరం నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ పొందినట్టు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన టాడా కోర్టు నేరస్థులుగా నిర్థరించారు.
మార్చి 12, 1993న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది మరణించగా..700 మందికి పైగా గాయపడ్డారు. ప్రత్యేక టాడా కోర్టు 100 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా.. ప్రధాన కుట్రదారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ పరారీలో ఉన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





