News

ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ

482views

భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు.

మే 21 వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి తెలిపారు. 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయని చైర్మన్ వివరించారు. కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి