
507views
-
ఉత్తరప్రదేశ్‌లో యోగి పారదర్శక పాలన
-
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశం
లక్నో: మూడు నెలల్లోపు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ప్రకటించాలని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు.
మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఐఏఎస్, ఐపీఎస్, ప్రొవెన్షియల్ సివిల్ సర్వీస్ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యం. ఆ స్ఫూర్తితో మంత్రులంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలను ప్రకటించాలి. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పట్నుంచి మూడు నెలల్లోపు ప్రకటించాలి” అని సూచించారు.





