
-
రూ. లక్షలు పంపిన గోరఖ్‌నాథ్ నేరస్తుడు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ
లక్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి చేసిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ ఐసీస్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగివున్నాడు. ఏప్రిల్ 3న జరిగిన గోరఖ్‌నాథ్ దేవాలయంపై జరిగిన దాడిపై ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అహ్మద్ ముర్తాజా అబ్బాసీ లక్షల రూపాయలు పంపినట్టు ఏటీఎస్ (యాంటీ టెర్రర్ స్క్వాడ్) విచారణలో తేలింది. అతని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇతర బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.
కరడుగట్టిన ఇస్లామిస్ట్ యెమెన్-అమెరికన్ బోధకుడు ఇమామ్ అన్వర్ అల్-హలాకీ అబ్బాసీకి మార్గదర్శకత్వం వహించినట్టు విచారణలో వెల్లడైంది. అబ్బాసీ ల్యాప్‌టాప్‌లో నిషేధిత ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ వీడియోలను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడికి ప్లాన్ చేస్తున్న 16 మంది వ్యక్తుల జాబితాను మార్చి 31న కేంద్ర నిఘా సంస్థలు పంచుకున్నాయి. క్లూని అనుసరించి, ఇద్దరు యుపి ఏటిఎస్ పోలీసులు ఏప్రిల్ 2న గోరఖ్‌పూర్‌లోని అబ్బాసీ ఇంటికి వచ్చారు. కానీ అతను ఇంట్లో లేడు. దాడికి ముందు అబ్బాసీ నేపాల్‌లో ఉన్నాడని, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మహరాజ్‌గంజ్‌లో బాకును కొనుగోలు చేశారని విచారణలో తేలింది.
Source: Organiser





