
442views
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు. ఇటీవల దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఛోటోగామ్ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ దుకాణదారుడిపై ఇద్దరు మోటారుసైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Source: Nijamtoday





