-
ఇప్పటికే కువైట్‌లో నిషేధం
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రకారం.. ఓ మాల్‌లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని రక్షించే సైనికుడిగా ఇందులో విజయ్ కనిపించబోతున్నాడు.
తమిళనాడులో ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ముస్లింలను తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా లేఖలో పేర్కొన్నారు.
కాగా, కువైట్‌లో ఈ సినిమాను నిషేధించారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల నివేదించిన ప్రకారం, కువైట్‌లోని సమాచార మంత్రిత్వ శాఖ ఈ చిత్రాన్ని నిషేధించింది. కారణాలు ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, సినిమాలో ముస్లింల పాత్రపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహిస్తున్నారు.
Source: NationalistHub