
574views
న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు ప్రవేశించాయి. ఇది భారత సరిహద్దు కావడంతో వెంటనే గమనించిన భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది వెంబడించారు.
ఇది గమనించిన బోట్లు వెంటనే పాక్ జలాల్లోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒక బోటును పిల్లర్ నెంబర్ 1160 వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం భారత్-పాక్ సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది. హరామి నాలా ప్రాంతం భారత్-పాక్‌ల సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తుంటారు.





