News

పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!

448views
  • కర్ణాటక మంత్రి హెచ్చ‌రిక‌

బెంగ‌ళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ‘‘మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ముస్లింలను గౌరవిస్తాం కానీ, ఇక్కడ పండే తిండి తింటూ పాకిస్థాన్ జిందాబాద్ చెప్పేవారిని మాత్రం వదిలిపెట్టబోం’’అని ఈశ్వరప్ప అన్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు ముస్లింలను మభ్యపెడుతున్నారు. ఇది మంచిది కాదు. మేం హిందుత్వవాదులం. మేం పుట్టినప్పటి నుంచి హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం కానీ మేం ముస్లింలను వ్యతిరేకించం’’అని ఈశ్వరప్ప స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి