
ఇస్లామాబాద్: పాకిస్తాన్, సుక్కుర్‌లోని రోహిలో 16 ఏళ్ళ హిందూ బాలిక పూజా ఓడ్‌ను అపహరించాలనే ప్రయత్నం చేశారు. అది కాస్తా విఫలమవ్వడంతో ఆమెను కాల్చేశారు. సింధీ మీడియా ప్రకారం.. బాలిక తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడంతో వీధి మధ్యలో కాల్చి చంపినట్టు ఫ్రైడే టైమ్స్ నివేదించింది.
ప్రతి సంవత్సరం ముస్లింలు మైనారిటీ హిందువులకు చెందిన అనేక మంది మహిళలను సింధ్ పాకిస్తాన్‌లో అపహరించి, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్‌లోని మైనారిటీ వర్గాలు చాలా కాలంగా బలవంతపు వివాహాలు, మతమార్పిడుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. పీపుల్స్ కమీషన్ ఫర్ మైనారిటీస్ రైట్స్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రకారం, 2013, 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిడుల సంఘటనలు జరిగాయి. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య వేళల్లో ఉంటుంది.
2019లో, సింధ్ ప్రభుత్వం రెండోసారి బలవంతపు మతమార్పిడులు, వివాహాలను చట్టవిరుద్ధం చేయడానికి ప్రయత్నించింది. కొంతమంది ఈ బిల్లును వ్యతిరేకించారు. అమ్మాయిలు ముస్లిం పురుషులతో ప్రేమలో పడి బలవంతంగా మతం మార్చుకోలేదని వాదిస్తూ ఆ చట్టాన్ని తిరస్కరించేలా చేశారు. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం పాకిస్తాన్‌లో హిందూ సమాజం మొత్తం జనాభా 1.6 శాతం, సింధ్‌లో 6.51 శాతం.
Source: NationalistHub





