
461views
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో లష్కరేతోయిబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయడం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
పుల్వామా జిల్లా కాకాపొరాకు చెందిన లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ దార్ అలియాస్ ఖాలిద్, అలియాస్ షీరాజ్ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కూడా వెల్లడైందని పోలీసు శాఖ ప్రతినిధి వెల్లడించారు.