News

2070కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్

544views

న్యూఢిల్లీ: పర్యావరణ సానుకూల ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.

”ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ యాస్పిరేషనల్ ఎకానమీ” అనే అంశంపై మంగళవారం జరిగిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని చెప్పారు. ఆ దిశగా పనులు వేగవంతం చేయడానికి పర్యావరణ హిత ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి