
-
పిస్టల్ కొనుగోలు పథకాన్ని పసిగట్టిన ఎన్.ఐ.ఎ
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ హిందూ వ్యక్తిని హత్య చేసేందుకు ముస్లిం యువకులు కుట్ర పన్నారు. నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు ముస్లిం మహిళను వివాహం చేసుకున్న యువకుడి తండ్రి. పశ్చిమ బెంగాల్ నుంచి పిస్టల్‌ను కొనుగోలు చేసేందుకు నిందితులు పథకం రచించారు. అయితే, ఈ వ్యవహారాన్ని ఎన్.ఐ.ఎ పసిగట్టి, హుటాహుటిన తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేసింది.
కుమారేశన్ కుమారుడు అరుణ్ కుమార్ ఇటీవల ముస్లిం మహిళ సహానను వివాహం చేసుకున్నాడు. మహిళా కుటుంబ సభ్యులు అరుణ్‌కుమార్‌ను ఇస్లాంలోకి మారాలని కోరారు. అమ్మాయి తల్లి మతం మార్చుకోమని వత్తిడి చేసిందని ది హిందూ తెలిపింది. అయితే, ఈ డిమాండ్‌పై కుమరేసన్ విమర్శలు గుప్పించారు. దీంతో కోపోద్రిక్తులైన మహిళ బంధువులు కుమరేశన్ హత్యకు కుట్ర పన్నారు.
వారిలో ఒకరైన సదాం హుస్సేన్(29)ని తుపాకీతో హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు అప్రమత్తమై హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనను కుమరేశన్‌ను హత్య చేసేందుకు పంపినట్టు అంగీకరించాడు. పోలీసులు ఇంకా కూపీ లాగగా బక్రుదీన్(54), ఇమ్రాన్ ఖాన్(39), మహ్మద్ అలీ జిన్నా(47), రాంవీర్(20) పేర్లు బయటకు వచ్చాయి. వెంటనే అరెస్టు చేశారు. వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా హత్య చేసేందుకు నిందితులు ప్లాన్ వేసినట్టు తమిళ మీడియా పోలిమర్ న్యూస్ పేర్కొంది.
Source: HINDU POST





