News

11న భారత్-చైనా మధ్య శాంతి చర్చలు

339views
  • సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడమే ఎజెండా

న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు ఈ నెల 11న జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన ఘర్షణ ప్రదేశాల వద్ద కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఈ 15వ విడ‌త‌ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ పరిణామాల గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా మంగళవారం ఈ వివరాలను వెల్లడించింది.

2020 మే నెలలో తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఘర్షణ ప్రారంభమైంది. 2020 జూన్ 15/16 తేదీల మధ్య రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడం కోసం దౌత్య, సైనిక కమాండర్ల స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. జనవరి 12న జరిగిన 14వ విడత చర్చల్లో పెద్దగా సానుకూల ఫలితాలు కనిపించలేదు.

ఈ ప్రతిష్టంభనను తొలగించడం కోసం పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇరు వర్గాలు చెప్పాయి. చ‌ర్చ‌లు భారత దేశం వైపుగల చూషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద జరుగుతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి