News

ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి: త్రిదండి అహోబిల రామానుజ జీయర్

5views

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుని సత్సంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు.

కర్నూలు నగర శివారులోని మామిదాలపాడులో ఉన్న గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకులం క్షేత్రం)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు స్వామీజీకి స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ గోదా రంగనాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ క్షేత్రాన్ని స్థాపించిన త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రం ఈ ఏడాది నవంబరు 8న జరగనున్నట్లు తెలిపారు. తిరునక్షత్ర మహోత్సవాలు బుధవారం ప్రారంభమై అక్టోబరు 26 వరకు కొనసాగనున్నాయని చెప్పారు.

మహోత్సవాల సందర్భంగా “ఇంటింటా సత్సంగం” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టాలని భక్తులకు సూచించారు.

కార్యక్రమంలో గోకులం ప్రతినిధులు తుమ్మేపల్లి శ్రీనివాసరావు, పెరుమాళ్ల బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.