News

తిరుప‌తిలో అదనంగా రెండు గంటల దర్శనం

491views

తిరుప‌తి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా మూడు గంటలు దర్శన భాగ్యం లభిస్తుంది. అదేవిధంగా శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. ఈ మూడు రోజుల్లో రోజుకు 30 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నట్టు తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి