
473views
శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షకునిగా ఉన్న పి. ఉమేశ్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఉమేశ్ ను సస్పెండ్ చేసినట్లు శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి సంబంధించిన సరకుల నిల్వలలో తేడాలు ఉండటంతో ఈవో ఈ మేరకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం దేవస్థానంలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ఉపయోగించే సరకుల నిల్వలను అధికారులు పరిశీలించినపుడు బియ్యం, పప్పుల నిల్వలలో తేడాలుండటాన్ని అధికారులు గుర్తించారు. అవి మాయం కావటానికి ఆలయ పర్యవేక్షకుడు ఉమేశే కారణమనటానికి తగిన ఆధారాలు లభించటంతో వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.





