News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

630views

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో కుల్గాం జిల్లా హసన్‌పొరాలో తనిఖీలు చేపట్టాగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు భద్రతా దళాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.