News

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు

604views

పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తితిదేతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పలు పర్యాటక స్థలాలను బీఈఈ ఎంపిక చేసింది. తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల ద్వారా కొంత మేర విద్యుత్ ‌ను ఆ భవనాల్లో ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.