
-
‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు
-
మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
అగర్ మాల్వా: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఇక్కడి ఒక ప్రైవేట్ పాఠశాలలో, కొంతమంది అబ్బాయిలు జాతీయ గీతం తర్వాత ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేయలేదు, ఆ తర్వాత ఈ విషయమై విద్యార్థుల మధ్య గందరగోళం నెలకొంది.
‘బడి విడిచిపెట్టిన తర్వాత, కొంతమంది ముస్లిం విద్యార్థులు భరత్ సింగ్ రాజ్‌పుత్, అతని స్నేహితులపై దాడి చేశారు. కసాయి మొహల్లా సమీపంలో కర్రలతో కొట్టారు. అలాగే, భారతదేశం అంటే ఏమిటి, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయండి అని మాకు చెప్పడానికి మీరేవరు?, ఎక్కువ చేస్తే చంపేస్తామని కూడా బెదిరించారు’ అని పోలీసులు చెప్పారు.
అల్లర్లు, దాడి చేసిన ఆరోపణలపై తొమ్మిది మంది తెలిసిన, తొమ్మిది మంది తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు బాదోడ్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వివేక్ కనోడియా తెలిపారు. భరత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాహిర్, అజార్, షకీల్, పింటు, షోఫీ, రాజా, ఇతరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కనోడియా తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
Source: Organiser





