
-
పంజాబ్‌లోని అక్రమ కబేళాపై పోలీసుల దాడి
-
11 మంది అరెస్టు, నిందితుల్లో ముస్లింలు, క్రిస్టియన్లు
గురుదాస్‌పూర్: పంజాబ్ రాష్ట్రంలో గోవులను వధిస్తున్న అక్రమ కబేళాను పోలీసులు కనుగొన్నారు. గోవులను అతి దారుణాతి దారుణంగా చంపేస్తూ ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని ధారివాల్ ప్రాంతంలో అక్రమంగా ఈ కబేళాలను ఉంచారు. అక్కడ 11 మంది నిందితులను ఆవుల తలలపై సుత్తితో కొట్టి దారుణంగా చంపినందుకు అరెస్టు చేశారు.
10 రోజుల క్రితం పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, గోశాలలలో ఆవులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి లూథియానాలో గోసంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి అక్రమ కబేళాలపై పంజాబ్ ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టింది. సోమవారం రాత్రి గురుదాస్‌పూర్ ఎస్‌ఎస్‌పి డాక్టర్ నానక్ సింగ్ సూచన మేరకు 40 మంది పోలీసు సిబ్బంది, అధికారుల బృందం అక్రమ కబేళాలపై దాడి చేసింది. పోలీసు బృందం ఇక్కడికి చేరుకున్నప్పుడు ఓ భారీ వస్తువు వల్ల తలకు గాయాలై చనిపోయిన మూడు ఆవులు కనిపించాయి.
వాటి తలపై భారీ సుత్తితో మోది చంపేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు. గాయపడిన ఆవులను కనుగొని.. మరో నాలుగు ఆవులను రక్షించారు. ఈ ఆవుల ముక్కు రంధ్రాలు మూసివేసియున్నాయి. కాళ్ళకు తాళ్ళు కట్టివేసియున్నాయి. భరించలేని వాసనల మధ్య మూడు గంటల పాటు రైడ్ కొనసాగింది. ఈ సమయంలో పోలీసులు పెద్ద మొత్తంలో ఆఫాల్, ఎముకల కుప్ప, ప్రాసెస్ చేయని మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ గోవుల వధ జరుగుతోందని ఆధారాలు సూచించాయి.
అరెస్టయిన నిందితులలో ధాలివాల్‌లోని తరిజనగర్‌కు చెందిన నియమత్ మసిహ్, అతని కుమారుడు రవి గోవుల వధకు సూత్రధారులుగా ఉన్నారు. ధరివాల్ ప్రాంతానికి చెందిన విక్కీ మసిహ్, రవి, థామస్ మసిహ్, జైసం మసిహ్, జానీ, బాల్కర్ మసిహ్ ఇతర నిందితులుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు నిందితులు వసీం, నాసక్, తన్వీర్‌లు ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లా నానాజూటా గ్రామానికి చెందినవారు.
నిందితులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, పంజాబ్ గో వధ చట్టం 1955 ఐపిసి 295, 428, 429 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుండి సుత్తులు, కత్తులు, ఇతర పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరించారు. గాయపడిన ఆవును చికిత్స కోసం స్థానిక పశు వైద్యశాలకు తరలించగా.. చనిపోయిన ఆవులను పోస్టుమార్టం కోసం పంపించారు. కల్యాణ్‌పూర్‌లో ఆవులను కొందరు వ్యక్తులు వధిస్తున్నారనే సమాచారం రావడంతో బృందంగా ఏర్పడి దాడి చేశారు.
Source: NationalistHub





