News

ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే R S S మరింత బలోపేతం కావాలి – జస్టిస్ జె. బెంజమిన్ కోషి

898views

ఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్‌లో పండిట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయుల ఊచకోత గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరింత బలోపేతం కావాలని పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ జె. బెంజమిన్ కోషి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎడపల్లి నగర్‌లో నిర్వహించిన విజయదశమి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. RSS సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

జస్టిస్ బెంజమిన్ కోషి మైనారిటీలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడానికి, దేశంలో జరిగే కొన్ని హింసాత్మక కార్యకలాపాల బాధ్యతను ఆర్‌ఎస్‌ఎస్ ‌పై మోపడానికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక వ్యవస్థీకృత ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోందని శ్రీ కోషి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది దేశ ప్రగతి మరియు సమగ్రత కోసం పనిచేసే దేశభక్తుల సంస్థ అని, RSS లో యువతకు ఆ విధంగా శిక్షణ ఇస్తారని ఆయన అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి లేదా సంస్థకు మద్దతుదారు కాదని కూడా ఆయన పేర్కొన్నారు.

“నేను ఆర్థడాక్స్ చర్చికి చెందిన క్రిస్టియన్ ని అని అందరికీ తెలుసు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విదేశీ ఆధిపత్యంలో నడిచే సంస్థ కాదు. ఆర్. ఎస్. ఎస్ మన స్వంత సంస్కృతిలో లీనమైన జాతీయ దృష్టితో పెరుగుతోంది. దేవుని ప్రేమ మరియు శక్తిని ఇతరులకు అందించాలని నమ్ముతారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ మన దేశంలో వివిధ రాష్ట్రాలు, విభిన్న ఆచారాలు, మతాలు, కులాలు మొదలైన వాటిని సంరక్షించడానికి, దేశాన్ని మొత్తం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యువతకు ప్రోత్సాహం, శిక్షణ ఇస్తారు.” అని శ్రీ కోషి తెలిపారు. తాను సేవాభారతి యొక్క అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు కూడా ఆయన చెప్పారు. కేరళలో వరదలు సంభవించినపుడు, కోవిడ్ కష్ట కాలంలో సేవాభారతి విస్తృతమైన సహాయ కలాపాలను నిర్వహించిందని ఆయన కొనియాడారు. సేవాభారతి, ఆర్. ఎస్. ఎస్ కార్యకలాపాలు మరింతగా విస్తరించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. మనస్సును కప్పి ఉంచే చీకటిని తొలగించడమే నవరాత్రి వేడుకల లక్ష్యమని ఆయన తెలిపారు.

Source : VSK KERALA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.