News

కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..

471views

మ్ముకశ్మీర్​​లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్​లోని ఈద్​గఢ్​ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్​ సుపీందర్​ కౌర్​, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల​ హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.

అమిత్ షా ఆదేశాలతో ఉగ్రవాద నిరోధక విభాగం అధిపతి తపన్ దేకా నాయకత్వంలో ఐబీ ఉన్నతాధికారులు శ్రీనగర్‌లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్యలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న జమాత్​-ఎ-ఇస్లామి​, తెహ్రీక్​-ఎ-హురియత్​ సహా పలు ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలున్న 400 మందిని NIA అధికారులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.