News

ఉగ్రవాది జాకీర్‌కు పాక్‌ నుంచి ఫోన్లు!

416views

ముంబై: ‘ఉగ్రవాద చర్యలకు నేరపూరిత కుట్ర’ కేసులో గత నెలలో అరెస్టయిన జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌కు పాకిస్తాన్‌ నుంచి కాల్స్‌ వచ్చాయి. దీనిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) అధికారులు బుధవారం నిర్ధారించారు. జాకీర్‌ హుస్సేన్‌ షేక్‌, మరో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు రిజ్వాన్‌ మోనిమ్‌, ఇర్ఫాన్‌ షేక్‌ ఈ నెల 11వ తేదీ వరకు మహారాష్ట్ర ఏటీఎస్‌ కస్టడీలో ఉంటారు.

‘దర్యాప్తు సమయంలో, జాకీర్‌ షేక్‌ వాయిస్‌ ఓవర్‌(ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌) కాల్స్‌ పాకిస్తాన్‌ నుండి అందుకున్నట్టు నిర్ధారణ అయిందని మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ వినీత్‌ అగర్వాల్‌ వెల్లడిరచారు. ‘నంబర్లు పాకిస్తాన్‌ నుండి వచ్చినవని నిర్ధారించలేము కానీ, ఐపి చిరునామా పాకిస్తాన్‌కు చెందినది’ అని ఆయన తెలిపారు. జకీర్‌ను మహారాష్ట్ర ఏటీఎస్‌ గత నెల 17న ముంబైలో అరెస్టు చేసింది. ‘పొరుగు దేశం’ నుండి ఆంథోనీ అలియాస్‌ అన్వర్‌ అలియాస్‌ అనాస్‌తో జకీర్‌ టచ్‌లో ఉన్నట్టు ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఏటీఎస్‌ తెలిపింది. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలలో పేలుడు పదార్థాలను ఉపయోగించి తీవ్రవాద దాడులు చేయడానికి అతను నేరపూరిత కుట్ర చేస్తున్నాడని కూడా కోర్టుకు వివరించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి