News

‘సోమనాథ్‌’ ద్రోహి గజినీని కీర్తించిన హక్కానీ!

558views

కాబుల్‌: గజనీ మహమ్మద్‌ పదో శతాబ్దంలో గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్‌ ఆలయంపై దాడి చేసి, సోమనాథ్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మాకు స్ఫూర్తిగా నిలిచిందని హక్కానీ నెట్‌వర్క్‌ నాయకుడు, తాలిబాన్‌ ప్రభుత్వంలో భాగమైన అనాస్‌ హక్కానీ కీర్తించాడు. అంతేకాదు… ఆ పని మాకెంతో గర్వంగా, ధైర్యం ఇచ్చేదిగా, స్ఫూర్తినిచ్చేదిగా ఉంది’ అని గజనీని ఆకాశానికి ఎత్తాడు.

గజనీ సమాధిని అనాస్‌ హక్కానీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ రోజు, మేము 10వ శతాబ్దపు ప్రఖ్యాత ముస్లిం యోధుడు, ముజాహిద్‌ సుల్తాన్‌ మహ్మద్‌ గజనీ మందిరాన్ని సందర్శించాము. అల్లాప్‌ా కరుణ వల్ల గజనీ ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం పాలనను స్థాపించాడు. సోమనాథుని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు’.. అని అందులో రాశారు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం భారతదేశంతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో తాలిబాన్‌ నాయకుడు పై విధంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాలిబాన్‌ నాయకుడి అనుచిత వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ, బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా ట్వీట్‌ చేశారు. ‘సోమనాథ్‌ మళ్లీ అగ్రస్థానంలో ఉంది. కానీ గజనీ, ఘోరి, తైమూర్‌ నగరాలు పేదరికం, ఆకలితో నశించిపోతున్నాయి’… అని దీటుగా ప్రతిస్పందించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి