
Italian Foreign minister Luigi Di Maio attends the G20 of foreign and development ministers meeting in the southern Italian city of Matera, Italy, June 29, 2021. ANSA/Angelo Carconi/Handout via REUTERS
404views
-
ఐరాసలో భారత్ స్పష్టం
ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్థాన్ భూభాగం నుంచి ఏ విధమైన ఉగ్ర కార్యకలాపాలను అనుమతించమన్న హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. అఫ్గాన్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా విస్తృత సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయని తెలిపింది.
ఐరాస 76వ వార్షిక సమావేశాల సందర్భంగా జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ ప్రజలతో ఉన్న చారిత్రక మైత్రీ ఆధారంగానే భారత్ సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు.





