News

భారతీయులంతా హిందువులే…

669views
  • ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్ చాల‌క్‌ మోహన్‌ భగవత్‌

ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘ్ స‌ర్ సంఘ్ చాల‌క్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలవాలన్నారు. హిందువులు ఎవరి పట్ల శత్రుత్వం చూపరని, దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఫౌండేషన్‌ సంస్థ ముంబయిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి