-
అంతర్జాతీయ హక్కులు, భద్రత సంస్థ హెచ్చరిక
న్యూఢిల్లీ: చైనా చేపడుతున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ పథకంతో పర్యావరణం దెబ్బతింటుందని, భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సుమారు 90 శాతం కార్బన్ ఇంటెన్సివ్, శిలాజ ఇంధనంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను కాల్చడం ద్వారా పర్యావరణ మార్పులు మరింత తీవ్రంగా మారుతాయని అంతర్జాతీయ హక్కులు, భద్రతా సంస్థ (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ఎస్) తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 46 శాతం బొగ్గును మండిరచడం ద్వారా వస్తున్నాయని తెలిపిన ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ఎస్.. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు కారణం అయ్యే వాయువులు మాత్రం 72 శాతం విద్యుత్ రంగం నుంచి వస్తున్నట్టు తెలిపాయి. చైనా పరిధిలో ఈ ప్రాజెక్ట్ సుమారు ఐదు ఖండాల్లో విస్తరించి ఉంది. చైనా నియంత్రణ, పర్యావరణ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న కారణంగా… భూమిపై తీవ్రమైన, ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎఫ్‌ఎఫ్‌ఏఎస్ ఆవేదన వ్యక్తం చేసింది.