News

ఆఫ్ఘన్ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ సుదీర్ఘ చర్చ

523views

ఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల సేపు మోడీ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ముట్టడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం నాడు ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీ పుతిన్‌తో 45 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారని వార్తా సంస్థ ANI ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పుతిన్‌తో తాను మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. “ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలపై నా స్నేహితుడు ప్రెసిడెంట్ పుతిన్‌తో వివరణాత్మక మరియు ఉపయోగకరమైన అభిప్రాయాల మార్పిడి జరిగింది. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా భారత్-రష్యా సహకారంతో సహా ద్వైపాక్షిక ఎజెండాపై కూడా మేము చర్చించాము. ముఖ్యమైన సమస్యలపై సన్నిహిత సంప్రదింపులు కొనసాగించడానికి మేము అంగీకరించాము,” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

సోమవారం నాడు మోడీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో కూడా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు ప్రపంచంపై దాని ప్రభావం గురించి మాట్లాడారు. ద్వైపాక్షిక ఎజెండా గురించి చర్చించడమే కాకుండా, కోవిడ్ -19 కి వ్యతిరేకంగా వ్యాక్సిన్లలో సహకారం, వాతావరణ మార్పులపై పోరాటం మొదలైన వాటి గురించి మాట్లాడారు.

Source : NATIONALIST HUB

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.