
844views
కరోనా నియంత్రణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ వ్యక్తికి ఒక డోసు కొవాగ్జిన్‌ను, మరో డోసు కొవిషీల్డ్‌ను ఇవ్వవచ్చా అనేదానిపై 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.





