News

టోక్యోలో రికార్డు స్థాయి కరోనా కేసులు… జపాన్ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివిటీ

@“Œ‹žEó‘‚Ì’‡Œ©¢’Ê‚è‚ðƒ}ƒXƒNŽp‚Å•à‚­l‚½‚¿‚P‚Q“úŒß‘O
595views

టోక్యోలో ఒలింపిక్స్ నేపథ్యంలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంపై జపాన్‌ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. టోక్యో లోనే కాకుండా దేశం మొత్తం మీద కేసులు భారీగా పెరుగుతున్నాయని చీఫ్ కేబినెట్ సెక్రటరీ కట్సునొబొ కటో మీడియాకు తెలిపారు. వారం క్రితం కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు కాగా, బుధవారం 3177, గురువారం 3885 నమోదైనట్లు వెల్లడించారు. గతేడాది కన్నా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిపారు. జపాన్ కరోనా కేసులను, మరణాలను చాలావరకు అదుపులో ఉంచుతోంది. కానీ గత ఏడు రోజులుగా సరాసరి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో జపాన్‌ ప్రభుత్వం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.