తృణమూల్ దౌర్జన్యాల బాధితుల పునరావాస ఏర్పాట్ల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ : కోల్కతా హై కోర్టు నిర్ణయం

547views
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి లను కమిటీ సభ్యులుగా హైకోర్టు నియమించింది.
సదరు కమిటీ పోలీసులతో సమన్వయం చేసుకుని బాధితులు తమ స్వస్థలాలలో తిరిగి వెళ్లేలా చేయనుంది. ఒకవేళ అక్కడ ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది.
ఐదుగురు సభ్యుల హైకోర్టు ధర్మాసనం ఎన్నికల అనంతరం హింసపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వాదనలు వింటోంది. మే 2న బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో చోటుచేసుకున్న దారుణ హింసాత్మక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Source : Organiser.





