News

దేశీయ ఆయుధ పరిశ్రమకు ఊతం… 108 రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం

559views

దేశీయ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న 108 రక్షణ పరికరాలను ఇకనుంచి దేశంలోనే తయారుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి దిగుమతులు పూర్తిగా నిషేధించింది. వీటిలో కొత్త తరం కార్ వైట్ యుద్ధనౌకలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంకు ఇంజిన్ లు , రాడార్లు వంటివి ఉన్నాయి.

ఆ వివరాలను ఈ క్రింది ఛాయా చిత్రాలలో చూడవచ్చు…..

గతేడాది 101 ఆయుధాల దిగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజా గా ఈ నిర్ణయం తీసుకుంది . ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.