కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.
మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.
క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం.
కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.
మనకు ఏదీ అసంభవం కాదు.
ఈ శతాబ్దం మనది.
భారత్ స్వయం సమృద్ధం కావాలి.
ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.
1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.
2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్.
3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.
4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.
5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.
ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.
ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.
ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!
2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.
కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.
కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.
జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.
స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!
ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!
కరోనా ఇప్పట్లో పోదు.
దాన్ని భరిస్తూ బతకాలి.
లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.
ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...