News

ఆరెస్సెస్ కార్యక్రమంలో క్రైస్తవ పాస్టర్.. జీర్ణించుకోలేకపోతున్న విరోధులు

280views

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొట్టాజయం జిల్లాలోని పూంజర్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థుల సమావేశం నిర్వహించింది. ఈ విద్యార్థుల సమావేశానికి క్రైస్తవ పాస్టర్ జార్జ్ నెల్లికున్న చెరికు పురాయిడోమ్ హాజరయ్యారు. అయితే ఆరెస్సెస్ కార్యక్రమంలో ఓ క్రైస్తవ పాస్టర్ పాల్గొనడం అనేది సో కాల్డ్ లౌకిక వాదులకు, ఆరెస్సెస్ వ్యతిరేకులకు సుతారమూ నచ్చడం లేదు.

ఆరెస్సెస్ కార్యక్రమాకి పాస్టర్ పాల్గొనడంపై మరో పాస్టర్డియోసెస్ వికార్ జనరల్ ఫాదర్ జోసెఫ్ తడథిల్ స్పందిస్తూ.. జోసెఫ్ కల్లరంగట్ తన వ్యక్తిగత హోదాలో హాజరైతే బాగుండేది వాదించారు.డయోసెస్ ఏ రాజకీయ పార్టీ విషయాలలోనూ జోక్యం చేసుకోదని మరియు వాటిలో దేనికీ మద్దతు ఇవ్వదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎఫ్ఆర్ జార్జ్ నెల్లికున్ను చెరిసు పురాయిడామ్‌ను విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేేక భావజాలంతో ప్రసిద్ధి చెందిన సదరు చర్చ్ ప్రీస్ట్.. ‘ఇదంతా చూస్తుంటే.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సాటి క్రైస్తవులు పడుతున్న బాధలను కాథలిక్ క్లర్జీలో కొన్ని వర్గాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయం అర్థం అవుతుంది’ అని అన్నారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో మరియు కాథలిక్ సమాజంలో చర్చలకు దారితీసింది. అయినప్పటికీ, పాలా బిషప్ జోసెఫ్ కల్లరంగట్ మాత్రం తాను అన్నీ తెలిసే సంఘ కార్యక్రమంలో ప్రసంగించానని తేల్చి చెప్పారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టే తాను హాజరయ్యానని, హాజరు కావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా నిర్వాహకులు కూడా తనను ఆహ్వానించారని, అందుకే హాజరయ్యానని, సందర్భాన్ని పురస్కరించుకొనే ప్రసంగించానని అన్నారు.

ఈ సందర్భంగా క్రైస్తవ పాస్టర్ జార్జ్ నెల్లికున్న చెరికు మాట్లాడుతూ భారత దేశ ఆధ్యాత్మిక వారసత్వం, స్వాత్రంత్య పోరాటం ద్వారా ప్రేరణ పొందిన తరం ఆధునిక భారతాన్ని రూపొందించిందన్నారు. నేటి యువతరం సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, ప్రపంచ వేదికపై భారత దేశ వైభవం కనిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.