క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పిటిషనర్ చింతాడ ఆనంద్ ఏప్రిల్ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 15న ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతులు శనివారం వెలువడ్డాయి. ‘ఎస్సీల కిందకు ఎవరు వస్తారన్నది రాజ్యాంగ (ఎస్సీ) ఉత్తర్వులు-1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వుల్లోని క్లాజ్-3లో పేర్కొన్న మతాలు మినహా.. మరే మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఎస్సీ హోదా పోతుంది. అలాంటివారు ఎలాంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు, రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు చేసిన చట్టాల కింద పేర్కొన్న రిజర్వేషన్లు, హక్కులు, ప్రాధాన్యతలను పొందలేరు. రాజ్యాంగ ఉత్తర్వుల్లోని క్లాజ్-3 ప్రకారం వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీలుగా పరిగణించడానికి వీల్లేదు’ అని మార్చి 24న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పునఃసమీక్ష కోసం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. తాము గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాట్లూ లేనందున దీన్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘వాస్తవానికి, ఆఫీస్ నివేదిక ప్రకారం రివ్యూ పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. అందులోని లోపాలను నోటిఫై చేసినా పిటిషనర్ వాటిని సరిదిద్దలేదు. అయినా, న్యాయప్రయోజనాల దృష్ట్యా రిజిస్ట్రీ ప్రస్తావించిన లోపాలను పక్కనపెట్టి రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాం. గత తీర్పులో ఎలాంటి లోపాలూ లేనందన డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
9views
You Might Also Like
జూలై 21 నుంచి నందలూరులో సౌమ్యనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
4
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు...
‘‘నా కుమారుడు హిందువు.. అందుకే టార్గెట్ అయ్యాడు’’
5
ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP)...
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆహారాన్ని గౌరవించడం మన ధర్మం
ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం కాదు.. అది జీవానికి ఆధారం, చైతన్యానికి మూలం. అందుకే భారతీయ సంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తారు. అన్నం...
మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి
9
తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు...
ఆషాఢంలో గోరింటాకు సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా "గోరింటా పూసింది – మనసంతా నిండింది" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంత...
వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే
30
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను...





